ఆమదాలవలసలోని మెట్టక్కివలసలో గల అమ్మ వీధిలో ఆదివారం 'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా కార్యదర్శి మొదలవలస రమేష్, పట్టణ టీడీపీ నేత బీవీ రమణమూర్తి, మురళీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీధిలో ఉన్న పలు సమస్యలు నేతలకి ప్రజలు వివరించారు. సమస్య పరిష్కారం దిశగా ప్రయత్నం చేస్తామని వారు అన్నారు.