గార మండలం శాలిహుండం శ్వేతగిరి జాతరకు భీష్మ ఏకాదశి పర్వదినాన భక్తులు భారీగా తరలివచ్చారు. గురువారం జరిగిన ఈ యాత్రలో కొండపైకి వెళ్లే దారి జనసంద్రంగా మారింది. పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినా రద్దీని నియంత్రించడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. భక్తులు అధికారులకు సహకరించాలని కోరారు.