గార మండలం సాలిహుండం వద్ద కొలువై ఉన్న శ్రీ కాళీయా మర్ధన వేణుగోపాల స్వామి వారి మహోత్సవాల సందర్భంగా, నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి గురువారం రాత్రి కుటుంబ సమేతంగా స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ ధర్మకర్తలు ఆయనకు స్వాగతం పలికి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించడం ఆనందించదగ్గ విషయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.