మంగళవారం సాయంత్రం గార మండలం శ్రీకూర్మం లో పలు రైస్ మిల్లులను ఆర్డిఓ సాయి ప్రత్యూష తహసిల్దార్ చక్రవర్తి తో కలిసి తనిఖీ చేశారు. ధాన్యం నిల్వలు సక్రమంగా ఉండాలని, ట్రక్ షీట్, మిల్లర్ల లాగిన్ ధర అంశాలపై నిశితంగా పరిశీలించాలని ఆమె ఆదేశించారు. ధాన్యం కొనుగోలులో ఎటువంటి అవకతవకలు లేకుండా చూడాలని, రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని మిల్లర్ల యజమానులకు ఆమె స్పష్టం చేశారు.