గార మండలం శ్రీకూర్మం లోని శ్రీ కూర్మనాథుని ఆలయం కేతుగ్రస్త చంద్రగ్రహణం కారణంగా మూసివేయబడుతుందని ఆలయ ఈవో సి వాసుదేవరావు తెలిపారు. ఆదివారం శ్రీకూర్మం లో విడుదల చేసిన ప్రకటనలో, డోలోత్సవాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో గ్రహణ సమయంలో ఉదయం 11 గంటలకు ఆలయాన్ని మూసివేసి, గ్రహణం అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.