గార మండలం శ్రీ కూర్మనాధుని ఆలయ డోలోత్సవాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రతి ఏడాది కార్తీక మాసంలో నిర్వహించే ఈ ఉత్సవానికి ఏర్పాటు చేసిన సన్నిధానానికి వెళ్లే రహదారి బురదమయం కావడంతో అర్చకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రీకూర్మం నుండి దువ్వుపేట వద్ద ఉన్న సన్నిధానానికి స్వామివారిని పల్లకిలో ఊరేగించి పూజలు చేయడం సాంప్రదాయం.