గార: నిరుపేదలను ఆదుకునేందుకే సంక్షేమ పథకాలు అమలు

79చూసినవారు
నిరుపేదలకు అన్ని విధాల ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని ఎమ్మెల్యే గోండు శంకర్రావు తెలిపారు. ఆదివారం గార మండలం రామచంద్రాపురం పంచాయతీలో సూపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా పాల్గొన్నారు. ఆయన విద్యార్థులతో మాట్లాడుతూ తల్లికి వందనం అందుకున్నారా లేదా అని అడిగి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి బిడ్డకు తల్లికి వందనం అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్