శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి, కాజీపేట గ్రామాల్లో మంగళవారం సిరిమాన పండగకు అంకురార్పణ కార్యక్రమం వైభవంగా జరిగింది. గ్రామస్తులు వృక్షానికి బొట్టు పెట్టి మొరాట్లు వేయడంతో పండుగ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ, ఈ వేడుక సనాతన సంప్రదాయాలకు ప్రతీక అని, ఆరు వేల మంది మహిళలు ఘటాలతో అమ్మవారిని దర్శించుకోవడం శుభసూచకమని అన్నారు. పండగ విజయవంతంగా సాగేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు. గ్రామ పెద్దలు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లను పర్యవేక్షించారు.