దేవాలయాలకు ధూప దీప నైవేద్య నిధులు విడుదల

4చూసినవారు
దేవాలయాలకు ధూప దీప నైవేద్య నిధులు విడుదల
ఆమదాలవలస నియోజకవర్గ పరిధిలోని మూడు దేవాలయాలకు ధూప దీప నైవేద్య పథకం కింద బుధవారం రూ.10,000 చొప్పున నిధులు విడుదలయ్యాయి. ఇందులో గ్రామ వెతనం కోసం రూ.7,000, పథకానికి రూ.3,000 చొప్పున నేరుగా అర్చకుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయబడ్డాయి. శ్రీ సీతారామ స్వామి దేవాలయం (గరిడేమెర్ల కొత్తవలస), శ్రీ సుందర మల్లికార్జున స్వామి ఆలయం (మునగవలస), శ్రీ శ్యామలాంబ అమ్మవారి దేవాలయం (కొక్కొట) ఈ పథకం కింద లబ్ధి పొందాయి. ఈ నిధుల మంజూరుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, దేవాదాయ శాఖ మంత్రి రామానాయుడు రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు.