జగన్.. ఒక్క రోడ్డు వేశారా? ఒక్క ప్రాజెక్టు కట్టారా?: అచ్చెన్న ఫైర్

5చూసినవారు
మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి కింజరాపు అచ్చెన్న తీవ్ర విమర్శలు చేశారు. ఆదివారం కోటబొమ్మాళిలోని ఎన్టీఆర్ భవన్‌లో ఆయన మాట్లాడారు. 16 నెలలు జైల్లో ఉండి, రూ.లక్ష కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. ఒక్క అవకాశం ఇవ్వండి అంటే ప్రజలు గెలిపించారని.. కానీ ఎక్కడైనా ఒక రోడ్డు వేశారా, ఒక ప్రాజెక్టు కట్టారా అని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్ట్, అమరావతిని జగన్ నాశనం చేశాడని ఆయన దుయ్యబట్టారు.

సంబంధిత పోస్ట్