ప్రభుత్వం ఇచ్చిన స్థలాన్ని ఆక్రమించారని అధికారులకు ఫిర్యాదు చేసిన ఫలితం లేదంటూ ఓ దళితుడు తన గోడును శనివారం మీడియా ఎదుట వెల్లడించాడు. జలమూరు(M) టెక్కలిపాడుకు చెందిన వెంకటరమణ తండ్రికి 1976లో ఎస్సీ కేటగిరి కింద ఇచ్చిన స్థలంలోనే నివాసం ఏర్పరచుకున్నాడు. మిగిలిన స్థలాన్ని ఈ గ్రామాస్థుడే ఆక్రమించాడని ఆరోపిస్తున్నాడు. న్యాయం జరిగే వరకు టెక్కలి సచివాలయం ఎదుట సోమవారం కుటుంబంతో నిరాహార దీక్ష చేస్తానన్నాడు