ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


తెలంగాణలో విషాదం.. కుళ్లిన స్థితిలో రెండు మృతదేహాలు లభ్యం
Jan 29, 2026, 10:01 IST/

తెలంగాణలో విషాదం.. కుళ్లిన స్థితిలో రెండు మృతదేహాలు లభ్యం

Jan 29, 2026, 10:01 IST
హైదరాబాద్‌లోని మీర్‌చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుల్తాన్‌పురాలో ఓ ఫ్లాట్‌లో ఇద్దరు వృద్ధులు మొహమ్మద్ షకీల్, సర్వర్ బేగం అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. 40 ఏళ్లుగా ఒకే ఫ్లాట్‌లో నివాసం ఉంటున్న వీరిద్దరూ అవివాహితులు. శారీరకంగా దివ్యాంగురాలైన సోదరిని అన్న షకీల్ చూసుకుంటున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా జనరల్ హాస్పిటల్ మార్చురీకి తరలించారు. ఇది సహజ మరణమా లేక ఆత్మహత్యలా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.