అంపోలు పరిధిలో రైతుల రాకపోకలకు ఉపయోగపడే రహదారి నిర్మాణానికి జంగిల్ క్లియరెన్స్ పూర్తయింది. ఆడవరం నుంచి లింగం చెరువు మీదుగా అంపోలు శివాలయం వరకు నిర్మించనున్న ఈ రహదారి పూర్తయితే రైతులకు రవాణా సౌకర్యం మెరుగుపడి వ్యవసాయ అభివృద్ధికి తోడ్పడుతుందని శంకర్ గారు తెలిపారు. యంత్రాలతో చదును పనులు ఇప్పటికే పూర్తయ్యాయని, త్వరలో పూర్తి స్థాయి రహదారి నిర్మాణం చేపడతామని ఆయన పేర్కొన్నారు.