భామిని మండలం నేరడి వద్ద వంశధార నదిపై బ్యారేజీ నిర్మాణానికి లైన్ క్లియర్ అయింది. దశాబ్దాలుగా నలుగుతున్న వంశధార జల వివాదంలో రాష్ట్రానికి.. ముఖ్యంగా జిల్లా రైతాంగానికి భారీ ఊరట లభించింది. వంశధార నదీ జలాల వివాదాల ట్రిబ్యునల్ (వీడబ్ల్యుడీటీ) ఇచ్చిన తుది తీర్పును అమలు చేస్తూ కేంద్ర జలశక్తి శాఖ గత నెల 30న తుది గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ గెజిట్ ప్రకారం నేరడి బ్యారేజీ నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్‌కు ట్రిబ్యునల్ స్పష్టమైన అనుమతిని ఇచ్చింది. సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న స్పెషల్ లీవ్ పిటిషన్ల (ఎస్‌ఎల్‌పీ) తుది తీర్పునకు లోబడి ఈ ఆదేశాలు అమలులోకి వస్తాయని గెజిట్‌లో స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తయితో ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం అవుతుంది.