
ఉత్తరకొరియా క్షిపణి ప్రయోగం.. అప్రమత్తమైన జపాన్
ఇరాన్‌తో యుద్ధానికి అమెరికా బ్రేక్ ఇచ్చిన నేపథ్యంలో ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తమ ప్రాంతం నుంచి బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాలతో కలకలం రేపారు. బుధవారం, ఉత్తరకొరియా వోన్సాన్ ప్రాంతం నుంచి తూర్పు తీర సముద్ర దిశగా క్షిపణిని ప్రయోగించింది. ఇదే రోజు ఉదయం కూడా అదే ప్రాంతం సమీపం నుంచి పలు స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. ఈ ప్రయోగాల తర్వాత జపాన్ హెచ్చరిక జారీ చేసింది. జపాన్ ప్రధాన మంత్రి సనయె తకైచి కార్యాలయం ఈ విషయంపై ఎక్స్‌లో పోస్టు చేసింది. జపాన్ అధికారులు పౌరుల భద్రతపై సూచనలు జారీ చేశారు.




