ట్రాక్టర్ తిరగబడి వ్యక్తి దుర్మరణం

0చూసినవారు
ట్రాక్టర్ తిరగబడి వ్యక్తి దుర్మరణం
శ్రీకాకుళం గ్రామీణ మండలం సానివాడలో ఆదివారం జరిగిన ఘటనలో పిలకవానిపేటకు చెందిన ముద్దాడ రాంబాబు (31) మృతి చెందారు. పెద్దపాడు సమీపంలో ట్రాక్టర్ మెకానిక్ గా పనిచేస్తున్న రాంబాబు, ట్రాక్టర్ తో గ్రామం వైపు వెళ్తుండగా బరాటం చెరువు మలుపు వద్ద అదుపుతప్పి తిరగబడటంతో తీవ్ర గాయాలపాలయ్యారు. శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. రాంబాబు మృతితో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు విషాదంలో మునిగిపోయారు.

సంబంధిత పోస్ట్