శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల ఆర్ట్స్ కళాశాలలో ఈ నెల 27వ తేదీన మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ వై పోలి నాయుడు తెలిపారు. ఈ మేళాలో 12 ప్రముఖ కంపెనీలు పాల్గొని, 850 ఉద్యోగాలను భర్తీ చేయనున్నాయి. 18 నుండి 30 సంవత్సరాల వయస్సు గల నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.