ఆమదాలవలస ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద శుక్రవారం మెగా జాబ్ మేళా నిర్వహించబడనుంది. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ సిబ్బంది గురువారం ప్రకటన విడుదలచేశారు. ఈ జాబ్ మేళాలో 10వ తరగతి నుండి డిగ్రీ వరకు చదివిన అభ్యర్థులు పాల్గొనవచ్చని తెలిపారు. పాల్గొనే యువతికి ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.