
ముగ్గురు పిల్లలను చంపి.. ఆత్మహత్య చేసుకున్న తండ్రి
AP: నంద్యాల జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఉయ్యాలవాడ మండలం తుడుములదిన్నె గ్రామానికి చెందిన ఓ తండ్రి వేములపాటి సురేంద్ర (35) తన ముగ్గురు పిల్లలు కావ్యశ్రీ (7), ధ్యానేశ్వరి (4), సూర్య గగన్ (2)లకు విషం కలిపిన పాలు తాగించి చంపేశాడు. అనంతరం తండ్రి కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. సురేంద్ర భార్య మహేశ్వరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.




