శ్రీకాకుళం నగరంలోని ఇల్లిసిపురం వద్ద ఉన్న అభ్యుదయ డిగ్రీ కళాశాలలో మంగళవారం మెగా జాబ్ మేళా జరగనుంది. ఈ మేళాలో పలు కంపెనీలు పాల్గొని 500కు పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నాయని జిల్లా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారి సాయికుమార్ తెలిపారు. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, ITI, డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు naipunyam.ap.gov.in వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు.