మెలియాపుట్టి: 2 బైక్‌లు ఢీ.. ముగ్గురికి గాయాలు

3చూసినవారు
మెలియాపుట్టి: 2 బైక్‌లు ఢీ.. ముగ్గురికి గాయాలు
మెలియాపుట్టి విద్యుత్ సబ్ స్టేషన్ సమీపంలో శుక్రవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు గాయపడ్డారు. మామిడిగుడ్డి గ్రామానికి చెందిన ధర్నారావు, శ్రీకాంత్ ఒక బైక్‌పై, దిలీప్ మరో బైక్‌పై మెలియాపుట్టి వైపు వస్తుండగా, రెండు బైకులు ఒకదానినొకటి బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ధర్మారావు తీవ్రంగా గాయపడగా, అతన్ని 108 వాహనంలో టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు. మిగిలిన ఇద్దరు యువకులకు కూడా గాయాలయ్యాయి.

సంబంధిత పోస్ట్