శ్రీకాకుళంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో ఎమ్మెల్యే గొండు శంకర్

0చూసినవారు
శ్రీకాకుళం నియోజకవర్గంలో ఎమ్మెల్యే గొండు శంకర్ ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. గొంటి వీధిలో జరిగిన ఈ కార్యక్రమంలో లబ్ధిదారులకు ఆయన స్వయంగా పింఛన్లు అందజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీ మేరకు ప్రతి నెల 1వ తేదీనే ఇంటి వద్దకే పింఛన్లు అందజేస్తున్నారని, పింఛన్ల పెంపుతో లబ్ధిదారులు సంతోషంగా ఉన్నారని ఎమ్మెల్యే తెలిపారు. ఎన్టీఆర్ భరోసా ద్వారా నిరుపేదలకు ఆదరణ అందుతోందని, రాష్ట్రవ్యాప్తంగా మొదటి తేదీనే 100% పంపిణీకి కృషి చేయాలని సిబ్బందికి సూచించారు. ఎన్డీయే ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్