శ్రీకాకుళం జిల్లా, బమ్మిడివనిపేట పంచాయతీలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ అర్హులకు అందజేశారు. వృద్ధులకు, ఆధారం లేని వారికి ఈ పింఛన్లు కనీస అవసరాలు తీర్చడంతో పాటు, మందుల కొనుగోలుకు ఉపయోగపడతాయని, పిల్లల నుంచి గౌరవం లభిస్తుందని పింఛన్దారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వంశధార ప్రాజెక్టు ఛైర్మన్ అరవల రవి, మండల తెలుగుదేశం అధ్యక్షులు మూకాళ్ళ శ్రీనివాసరావు, తెదేపా నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.