మోంతా తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన శ్రీకాకుళం జిల్లా గార మండలంలోని బందరువానిపేట, కే.మచ్చలేశం, కళింగపట్నం పంచాయతీలలోని మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం తరపున తక్షణ సహాయం అందజేయడం ప్రారంభమైంది. శుక్రవారం ఎమ్మెల్యే గోండు శంకర్ 50 కేజీల చొప్పున రేషన్ బియ్యాన్ని పంపిణీ చేశారు. తుఫాన్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని, త్వరలోనే ప్రతి కుటుంబానికి కిలో చొప్పున ఆయిల్, కందిపప్పు, ఉల్లిపాయలు, బంగాళదుంపలు, పంచదార వంటి నిత్యావసర సరుకులను కూడా పంపిణీ చేయనున్నట్లు ఆయన తెలిపారు.