గురువారం శ్రీకాకుళం నగరంలోని పొట్టి శ్రీరాములు పెద్ద మార్కెట్ను ఎమ్మెల్యే గొండు శంకర్ సందర్శించి, అభివృద్ధి పనులను మున్సిపల్ కమిషనర్, రెవెన్యూ అధికారులు, స్థానిక నాయకులు, వర్తకులతో కలిసి పరిశీలించారు. మార్కెట్ను మోడల్ మార్కెట్గా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఈ పర్యటనలో వర్తకులు, స్థానికులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.