పొందూరు మండలం తాడివలస పంచాయతీలో రూ.2.85 కోట్ల వ్యయంతో నిర్మించిన పలు బీటీ, సిసి రోడ్లను బుధవారం స్థానిక ఎమ్మెల్యే కూన రవి కుమార్ ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని, రోడ్లు గ్రామాల ప్రగతికి ప్రాణాధారమని ఆయన అన్నారు. రోడ్ల ప్రారంభంతో గ్రామాల మధ్య రాకపోకలు సులభమై రైతులు, విద్యార్థులు, కార్మికులకు మేలు జరుగుతుందని తెలిపారు.