సరుబుజ్జిలి మండలం బుడ్డివలస గ్రామంలో రూ.78 లక్షల వ్యయంతో AIIB నిధులతో నిర్మించిన బీటీ రోడ్డును ఆమదాలవలస ఎమ్మెల్యే, రాష్ట్ర పియుసి చైర్మన్ కూన రవికుమార్ ప్రారంభించారు. గ్రామీణాభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, నాణ్యమైన రహదారుల నిర్మాణంతో ప్రజలకు మెరుగైన రాకపోకలు అందిస్తున్నామని, ఈ రోడ్డుతో విద్య, వైద్యం, వ్యవసాయ ఉత్పత్తుల రవాణా మరింత సులభం అవుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.