శ్రీకాకుళం–ఆమదాలవలస రోడ్డు మార్గంలో, శ్రీకాకుళం కాంప్లెక్స్ దగ్గర జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులను బుధవారం స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ స్వయంగా పరిశీలించారు. పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రణాళికాబద్ధంగా పనులు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌అండ్‌బీ, మున్సిపల్, ఆర్టీసీ అధికారులు, స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు.