అనాథ పిల్లల కోసం ఎన్నారై మీరాబాయి పెద్ద మనసు
శ్రీకాకుళం రెడ్ క్రాస్ భవనంలో అనురాగ నిలయంలోని అనాథ చిన్నారులకు ఎన్నారై ఉరిటి మీరాబాయి తన పుట్టినరోజు సందర్భంగా అండగా నిలిచారు. వారికి స్వీట్లు పంచడమే కాకుండా, ఇంటర్ చదువులకు అయ్యే ఫీజులు, యూనిఫారమ్, భోజనాల ఖర్చులను తానే భరిస్తానని ప్రకటించి తన గొప్ప మనసును చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో కే. శ్రీనివాస్, లలిత, సాయి సుధాకర్ పాల్గొన్నారు. రెడ్ క్రాస్ సంస్థ చైర్మన్ పి. జగన్మోహనరావు కృతజ్ఞతలు తెలిపారు.
