వరుస దొంగతనాలతో ప్రజలు భయాందోళన

1113చూసినవారు
వరుస దొంగతనాలతో ప్రజలు భయాందోళన
సారవకోట మండలంలో వరుస దొంగతనాలతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. గత నెలలో అవలింగిలో 23 తులాల బంగారం, రూ.1.5 లక్షలు నగదు దొంగిలించబడ్డాయి. సోమవారం రాత్రి బైదలాపురంలోని రాము ఇంట్లో 7 తులాల పుస్తెల తాడు, ఆదివారం రాత్రి అవలింగిలో మరో ఇంట్లో 2.5 తులాల పుస్తెల తాడు చోరీకి గురైంది. జిల్లాలో దొంగతనాల ఘటనలు పెరిగిపోయాయని, అధికారులు నైట్ బీట్ పెంచాలని ప్రజలు కోరుతున్నారు.