
ఎఫైర్.. భర్తను గొంతు నులిమి చంపిన భార్య!
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం గోవింద్పేట్లో దారుణం జరిగింది. భార్య చేతిలో ఓ భర్త హతమయ్యాడు. మెదక్ జిల్లాకు చెందిన దుర్గయ్య(36)ను భార్య మంజుల, సంజీవ్ అనే వ్యక్తితో కలిసి గొంతు నులిమి చంపినట్లు పోలీసులు తెలిపారు. భార్య వివాహేత సంబంధాన్ని భర్త గుర్తించడంతో ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడి చెల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఆర్మూర్ ఎస్హెచ్ఓ సత్యనారాయణ తెలిపారు.




