శ్రీకాకుళంలో పోలీసుల ముమ్మర తనిఖీలు

3చూసినవారు
శ్రీకాకుళంలో పోలీసుల ముమ్మర తనిఖీలు
శ్రీకాకుళం పట్టణంలో టూ టౌన్ పోలీస్ శాఖ ఆదివారం వేకువజామున పెద్ద రెల్లి వీధిలో కార్డెన్ సెర్చ్ నిర్వహించింది. ఇంటింటికీ వెళ్లి ద్విచక్ర వాహనాల పత్రాలను పరిశీలించి, సరైన పత్రాలు లేని వాహనాలను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అసాంఘిక కార్యకలాపాలు, అనుమానితులను గుర్తించే ప్రక్రియలో భాగంగా ఈ తనిఖీలు నిర్వహించినట్లు రెండవ పట్టణ సీఐ ఈశ్వరరావు తెలిపారు.