రీ-సర్వేతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం: ఎమ్మెల్యే కూన రవికుమార్

9చూసినవారు
వంజంగి పేట గ్రామంలో రీ-సర్వే ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది. ఈ సందర్భంగా ప్రభుత్వం రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్‌పుస్తకాలను శుక్రవారం ఆముదాలవలస ఎమ్మెల్యే, రాష్ట్ర పియూసీ చైర్మన్ కూన రవికుమార్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. రీ-సర్వే ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని, రైతుల హక్కులు స్పష్టంగా నమోదవుతాయని ఆయన తెలిపారు. స్పష్టమైన భూ రికార్డులు అందడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :