ఉత్తరప్రదేశ్ లోని జోన్ పూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.శ్రీకాకుళం జిల్లాకు చెందిన పలువురు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. జాతీయ రహదారిపై గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న వాహనాన్ని కారు ఢీ కొట్టంది. ఈ ఘటనలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించిన పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరించారు. బాధితులు కోటబోమ్మాళి, బ్రాహ్మణతర్ల, పలాస ప్రాంతాలకు చెందిన వారిగా గుర్తించారు.