సారవకోట మండల కేంద్రంలోని శ్రీ సత్యసాయి సేవా మందిరంలో ఆదివారం ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. మండల కమిటీ ఆహ్వానంతో జిల్లా సత్యసాయి సేవా సంఘం సభ్యులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లా అధ్యక్షులు రామచంద్రరావు, నాగేశ్వరరావు, ఆనంద గుప్తా, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.