శ్రీకాకుళంలో కార్తీక మాస ద్వితీయ సోమవారం సందర్భంగా శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు గంగాస్నానం చేసి, 'ఓం నమః శివాయ' నినాదాలతో ఆలయ ప్రాంగణాలను మార్మోగించారు. భక్తులు దైవదర్శనంతో పాటు అభిషేకాలు, ఆర్చనలు, రుద్రాభిషేకాలు నిర్వహించారు. మహిళలు దీపాలు వెలిగించి శివపూజలో పాల్గొన్నారు. వెంకట పురం ఎండల మల్లికార్జున స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిగాయి. కార్తీక సోమవారాల్లో శివారాధన చేస్తే పాపాలు నశిస్తాయని భక్తుల విశ్వాసం. కాశీబుగ్గ ఆలయ సంఘటన నేపథ్యంలో గ్రామ పెద్దలు తగు చర్యలు తీసుకున్నారు.