తెలుగు వారికి తీవ్ర గాయాలు.. స్పందించిన కేంద్ర మంత్రి

4చూసినవారు
తెలుగు వారికి తీవ్ర గాయాలు.. స్పందించిన కేంద్ర మంత్రి
ఉత్తరప్రదేశ్‌లోని జాన్పూర్‌ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై స్పందించిన కేంద్ర పౌరవిమానాయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు, క్షతగాత్రులను ఫోన్లో పరామర్శించారు. జూన్‌పుర్ జిల్లా కలెక్టర్, వారణాసి ఎయిర్ పోర్ట్ అధికారులు, వైద్యులతో మాట్లాడి, బాధితులకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని, అన్ని విధాల అండగా ఉండాలని ఆదేశించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వీరంతా వారణాసి నుంచి అయోధ్యకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.