కొత్తూరు (M) చిన్నారాజపురంలో మంగళవారం జరిగిన దారుణంలో, గ్రామానికి చెందిన సవర ఇల్లంగ (50), జ్యోతి (40) దంపతులను తోటయ్య అనే వ్యక్తి గొడ్డలితో నరికి హత్య చేశాడు. చిల్లంగి పెట్టారనే అనుమానంతో ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది. కొత్తూరు పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. హత్యకు పాల్పడిన తోటయ్యను అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.