గురువారం విడుదలైన 10వ తరగతి ఫలితాల్లో శ్రీకాకుళంలోని ఎస్ఆర్ ప్రైమ్ పాఠశాల
విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. అన్నేపు లాస్య 593, ఎల్. నిత్యశ్రీ 591, అకుల చాందిని 590 మార్కులు సాధించారు. 2026 ఏపీ 10వ తరగతి ఫలితాల్లో 69 మంది
విద్యార్థులు 500 మరియు అంతకంటే ఎక్కువ మార్కులు సాధించినట్లు జోనల్ ఇంచార్జ్ శ్రీహరి, పాఠశాల ప్రిన్సిపాల్ కె. విజయకుమార్, కె. శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ఈ అద్భుత విజయానికి కృషి చేసిన ఉపాధ్యాయ బృందానికి, విద్యార్థులను అభినందించారు.