శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలంలోని కే. మత్స్యలేశం గ్రామంలో 500 మందికి 'పోలీసు' అనే పేరు ఉంది. చేపల వేటను జీవనాధారంగా చేసుకున్న ఈ గ్రామంలోని ప్రజలు పోలేరమ్మను ఇలవేల్పుగా కొలుస్తారు. కాలక్రమేణా, గ్రామదేవత పేరునే పురుషులకు 'పోలీసు'గా, స్త్రీలకు 'పోలీసమ్మ'గా పెట్టుకున్నారు. గ్రామంలోని 4,500 మంది జనాభాలో 500ల మందికి ఈ పేరు ఉండటం శుభసూచకమని గ్రామస్థులు విశ్వసిస్తున్నారు.