శ్రీకాకుళం అరసవెల్లిలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన తెప్పోత్సవంలో భాగంగా, భక్తులు పుష్కరిణిలో ఆదిత్యుడిని దర్శించుకున్నారు. ఆలయంలోని అనివెట్టి మండపంలో శ్రీ సూర్యనారాయణ స్వామివారికి పూజలు నిర్వహించిన అనంతరం, పుష్కరిణిలో తెప్పోత్సవం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గుండు శంకర్రావుతో పాటు అధికారులు పాల్గొన్నారు.