శ్రీకాకుళం అరసవిల్లిలోని శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆలయంలో ఆలయ సంప్రోక్షణ అనంతరం డోలోత్సవం కార్యక్రమాలు బుధవారం నిర్వహించారు. ప్రత్యేక అలంకరణలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. తిరువీధి నిర్వహించిన అనంతరం చిన్న తోటలో ఉన్న మండపంలో స్వామివారిని వేంచేసి ప్రత్యేక పూజలు నిర్వహించామని ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ తెలిపారు. భక్తులు విశేషంగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.