అరసవల్లిలోని శ్రీ సూర్యనారాయణస్వామి ఆలయంలో మంగళవారం హుండీల లెక్కింపు జరిగింది. 19 హుండీలకు గాను 17 హుండీలను తెరిచి లెక్కించగా, 60 రోజులకు రూ. 1,01,65,500 నగదు, 30 గ్రాముల బంగారం, 1 కేజీ 700 గ్రాముల వెండి ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో ప్రసాద్ తెలిపారు. ఈ లెక్కింపు కార్యక్రమంలో దేవాదాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.