ప్రపంచ ఎయిడ్స్ డే సందర్భంగా శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో సోమవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ కే సూర్యచంద్రరావు మాట్లాడుతూ, రెడ్ రిబ్బన్ క్లబ్, ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగిందని, ఎయిడ్స్ వ్యాధి నివారణకు అవగాహనతోనే సాధ్యమని తెలిపారు. ఈ ర్యాలీ ద్వారా ప్రజల్లో ఎయిడ్స్ పై అవగాహన కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.