శ్రీకాకుళం: చెట్టుపై నుంచి జారిపడి కేబుల్ ఆపరేటర్ మృతి

0చూసినవారు
శ్రీకాకుళం: చెట్టుపై నుంచి జారిపడి కేబుల్ ఆపరేటర్ మృతి
శ్రీకాకుళం నగరంలో కేబుల్ ఆపరేటర్గా పనిచేస్తున్న ఆట్ల తవిటి రాజు (36) శుక్రవారం చెట్టుపై నుంచి జారిపడి మృతి చెందారు. 80 అడుగుల రోడ్డు సమీపంలో కేవీఆర్ సన్సిటీ పక్కన చెట్టు మీద నుంచి ప్రమాదవశాత్తూ పడిపోవడంతో తలకు బలమైన గాయమైంది. రిమ్స్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు.

సంబంధిత పోస్ట్