శ్రీకాకుళం: విద్యుత్ శాఖ కార్యాలయం వద్ద చలివేంద్రం ఏర్పాటు

2చూసినవారు
శ్రీకాకుళం: విద్యుత్ శాఖ కార్యాలయం వద్ద చలివేంద్రం ఏర్పాటు
శ్రీకాకుళం లోని స్థానిక విద్యుత్ శాఖ సర్కిల్ ఎం ఆర్ టి కార్యాలయం వద్ద దాహార్తిని తీర్చడానికి చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. గురువారం విద్యుత్ శాఖ ఈఈ చల్ల వెంకటేశ్వరరావు ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ, కార్యాలయానికి వచ్చే వినియోగదారుల దాహార్తిని తీర్చడానికి వేసవి కాలంలో మజ్జిగ పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :