డయేరియాను పూర్తిగా అరికట్టేందుకు 20 ప్రత్యేక టీమ్స్‌తో పర్యవేక్షణ నిర్వహిస్తున్నామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. శ్రీకాకుళంలో ఆదివారం మీడియాతో మాట్లాడారు. డయేరియాను పూర్తిగా అరికట్టేందుకు ప్రభుత్వం అన్ని చర్యలను తీసుకుంటుండగా కొంతమంది వ్యాపారులు చికెన్ షాపులను తెరవడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. యుద్ధ ప్రాతిపదికన పూడికతీత, వ్యర్థాల తొలగింపు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.