శుక్రవారం శ్రీకాకుళం కార్పొరేషన్ కమిషనర్ ఇన్‌ఛార్జిగా పల్లి నల్లనయ్య బాధ్యతలు స్వీకరించిన కొద్దిసేపటికే, ఆయనను వెనక్కి పంపాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆయన స్థానంలో బొడ్డేపల్లి రామును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాము గతంలో ఇచ్ఛాపురం, ఆమదాలవలస మున్సిపాలిటీల్లో కమిషనర్‌గా పనిచేసి, ప్రస్తుతం జీవీఎంసీలో అసిస్టెంట్ కమిషనర్‌గా ఉన్నారు. నల్లనయ్యను ఎందుకు తొలగించారనే దానిపై కారణాలు తెలియరాలేదు. ఈ ఆకస్మిక మార్పు శ్రీకాకుళం కార్పొరేషన్‌లో చోటుచేసుకుంది.