శ్రీకాకుళం: నేరుగా వారానికి ఒకసారి తిరుపతికి ట్రైన్

1చూసినవారు
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, 75 ఏళ్ల తర్వాత శ్రీకాకుళం - తిరుపతి మధ్య నేరుగా రెగ్యులర్ రైలు సర్వీస్ ప్రారంభం కాబోతోందని తెలిపారు. 'శ్రీకాకుళం నుంచి తిరుపతి, హైదరాబాద్కు నేరుగా ట్రైన్స్ నడపాలన్నది జిల్లా వాసుల కల. నేడు అది సాకారమైంది' అని ఆయన అన్నారు. 17439/40 హంసఫర్ ఎక్స్ప్రెస్ ప్రతి ఆదివారం తిరుపతి నుంచి, ప్రతి సోమవారం శ్రీకాకుళం నుంచి నడుస్తుందని, ఈ సర్వీస్ 13న శ్రీకాకుళం రోడ్ స్టేషన్లో ప్రారంభం కానుంది అని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్