శ్రీకాకుళం రూరల్ మండలం కుందువానిపేట గ్రామంలో తుఫాన్ ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొన్న 50 మంది మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం నిత్యావసర సరుకులను పంపిణీ చేసింది. మంగళవారం, మాజీ ఎంపీపీ గోండు జగన్నాధ రావు బియ్యంతో పాటు పలు నిత్యావసరాలను అందజేశారు. తన కుమారుడు ఎమ్మెల్యే శంకర్రావు ఆదేశాల మేరకు ఈ సహాయక చర్య చేపట్టామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానికులు పాల్గొన్నారు.